ఒకే కాన్పులో ముగ్గురు..!

ABN , First Publish Date - 2022-11-25T01:01:44+05:30 IST

ఒకే కాన్పులో ముగ్గురు కవలలు జన్మించిన ఘటన పట్టణంలోని పద్మశ్రీ ఆస్పత్రిలో గురువారం జరిగింది.

ఒకే కాన్పులో ముగ్గురు..!

నందిగామ రూరల్‌, నవంబరు 24 : ఒకే కాన్పులో ముగ్గురు కవలలు జన్మించిన ఘటన పట్టణంలోని పద్మశ్రీ ఆస్పత్రిలో గురువారం జరిగింది. పట్టణానికి చెందిన షేక్‌ అమీనా పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. రక్తం తక్కువగా ఉన్నప్పటికీ వైద్యులు సురేష్‌, మనోరమ, భరద్వాజ, వెంకటేష్‌లు ప్రసవం చేశారు. నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు మగ, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు చెప్పారు. ఒకే కాన్పులో ముగ్గురు కవలలు జన్మించటంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు.

Updated Date - 2022-11-25T01:01:44+05:30 IST

Read more