విద్యాదానానికి మించిన దానం లేదు

ABN , First Publish Date - 2022-09-28T06:19:02+05:30 IST

దానాలన్నింటిలోను విద్యాదానానికి మించిన దానం మరోటి లేదని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఉద్ఘాటించారు

విద్యాదానానికి మించిన దానం లేదు
విద్యార్థులకు యూనిఫాంలు అందజేస్తున్న తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, దాత రంగారావు, ఈశ్వరి దంపతులు

విద్యాదానానికి మించిన దానం లేదు

తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ 

కృష్ణలంక, సెప్టెంబరు 27 : దానాలన్నింటిలోను విద్యాదానానికి మించిన దానం మరోటి లేదని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఉద్ఘాటించారు. కృష్ణలంకలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు దాత దమ్మాలపాటి రంగారావు, ఈశ్వరి దంపతులు అందించిన యూనిఫాంలను మంగళవారం ఎమ్మెల్యే గద్దె అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 కళాశాల ప్రారంభం నుంచి దమ్మాలపాటి రంగారావు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు స్కూల్‌ బ్యాగులు, స్కాలర్‌షిప్‌లు, యూనిఫాంలు అందిస్తున్నారన్నారు. దాత దమ్మాలపాటి రంగారావు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల, స్కూళ్లలో చదివే పిల్లలకు తన శక్తిమేర ఆదుకొనేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. కళాశాలకు కావాల్సిన స్కానర్‌ను ఆయన మేనల్లుడు కొల్లి కళ్యాణ్‌ చక్రవర్తి (అమెరికా) అందిస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు. కృష్ణలంక వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మల దుర్గారావు, జె.ఎన్‌.భాస్కరరావు, టీడీపీ నాయకులు గొరిపర్తి నామేశ్వరరావు, కేశనం భావన్నారాయణ, కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ రూపాకుమారి పాల్గొన్నారు. 

Read more