‘పశ్చిమ’కు వెలంపల్లి చేసింది శూన్యం

ABN , First Publish Date - 2022-09-11T06:12:42+05:30 IST

‘పశ్చిమ’కు వెలంపల్లి చేసింది శూన్యం

‘పశ్చిమ’కు వెలంపల్లి చేసింది శూన్యం
మాట్లాడుతున్న సాదరబోయిన ఏడుకొండలు

వన్‌టౌన్‌, సెప్టెంబరు 10: పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస రావు చేసిన అభివృద్ధి శూన్యమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాదర బోయిన ఏడుకొండలు విమర్శించారు. బుద్దా వెంకన్న కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారన్నారు. టీడీ పీ హయాంలో 90 శాతం నిర్మాణాలు పూర్తయిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వకుండా మోసం చేస్తున్నారన్నారు. మంత్రిగా, ఎమ్యెల్యేగా వెలంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఏమీ చేయలేదని, ప్లై ఓవర్ల నిర్మాణం టీడీపీ హయాంలోనే జరిగిందని ఆయన అన్నారు. వైసీపీ పాలనలో ఇసుక, గనుల దోపిడీలు విచ్చలవిడిగా జరుగుతోందని, ప్రజలు పాలకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. గణపా రాము, ఈగల సాంబశివరావు, రాజగిరి అశోక్‌ పాల్గొన్నారు.   

Read more