సమ్మె కాలాన్ని వేతన సెలవుగా పరిగణించాలి

ABN , First Publish Date - 2022-08-25T06:10:42+05:30 IST

సమ్మె కాలాన్ని వేతన సెలవుగా పరిగణించాలి

సమ్మె కాలాన్ని వేతన సెలవుగా పరిగణించాలి

 ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌

గవర్నర్‌పేట, ఆగస్టు 24: రెగ్యులర్‌ ఉద్యోగులు, ఒప్పంద పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్‌ కార్మికులు జూలై 11 నుంచి 15 వరకు ఐదు రోజులపాటు నిర్వహించిన సమ్మె కాలాన్ని వేతనంతో కూడిన సెలవుగా పరి గణించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సీఐ టీయూ) ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు సీ అండ్‌ డీఎంఏ ప్రవీణ్‌ కుమార్‌కు బుధవారం అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. సమ్మెకాలపు ఒప్పందాల మినిట్స్‌ కాపీని జేఏసీ నాయకులకు అందజేయాలని కోరారు. విలీన గ్రామ పంచాయతీలు, కొత్తగా గుర్తింపు పొందిన నగర పంచాయతీ ల్లో పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబరు 7 ప్రకారం బకాయిలతో సహా జీతాలు, జీవో 109, 63 ప్రకారం ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్స్‌ బకాయిల ను చెల్లించాలని కోరారు. ఆప్కాస్‌లో చేర్చకుండా మిగిలిపోయిన మున్సిపల్‌ కార్మికుల పేర్లను వెంటనే నమోదు చేసి బకాయి జీతాలు, హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు చెల్లించాలని కోరారు.


Read more