-
-
Home » Andhra Pradesh » Krishna » The state is in decline under the rule of the incompetent CM-NGTS-AndhraPradesh
-
అసమర్థ సీఎం పాలనలో రాష్ట్రం అధోగతి
ABN , First Publish Date - 2022-10-04T06:37:02+05:30 IST
అసమర్థ సీఎం పాలనలో రాష్ట్రం అధోగతి

గొల్లపూడి, అక్టోబరు 3 : అసమర్థ సీఎం పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని కోరుతూ గొల్లపూడిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మూడున్నరేళ్లలో అక్రమ కేసులు, అరెస్టులు తప్ప ఈ ప్రభుత్వం చేసింది శూన్యమ న్నారు. ఏపీ సీఐడీ పోలీసులు పక్క రాష్ట్రంలోనూ నవ్వులపాలవుతున్నారన్నారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారన్నారు. ప్రజాకంటక పాలన చేస్తున్న సర్కార్ను రాబోయే రోజుల్లో సాగనంపటానికి జనం సిద్ధంగా ఉన్నారని, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు కొనసాగించేంత వరకు పోరాడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో తంగిరాల సౌమ్య, నెట్టెం రఘురామ్ మాట్లాడారు.
ఎన్టీఆర్ పేరే కొనసాగించాలి
తిరువూరు: హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని టీడీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి శావల దేవదత్ డిమాండ్ చేశారు. సోమవారం టీడీపీ న్యాయవిభాగం, ఐటీడీపీ ఆఽధ్యర్యంలో రిలే దీక్ష నిర్వహిం చారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడాన్ని ప్రజలు సహించరన్నారు. టీడీపీ, తెలుగుయువత, బీసీ, ఎస్సీ సెల్, టీఎన్టీయూసీ నాయకులు రిలేదీక్షలకు సంఘీభావం తెలిపారు. దీక్షలో న్యాయవాదులు సంకురాత్రి జనార్దన్, రాజవరపు శ్రీనివాసరావు, చింతల వెంకటరెడ్డి, కొత్తపల్లి ఆనంద్స్వరూప్, మెగపర్తి సత్యం, మర్సకట్ల కుమార్, వాకదాని లక్ష్మీనారాయణ, కోట వెంకటేశ్వరరావు, నాగుబండి రామకృష్ణ, అత్తులూరి శ్రీనివాసరావు, మురహరి ఐటీడీపీ సభ్యులు, బండి శివకేశవ్, నర్సరెడ్డి, మల్లవరపు చైతన్య, జమలారావు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
