రాజ్‌భవన్‌ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2022-12-30T00:48:32+05:30 IST

గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నగరంలో ని రాజ్‌భవన్‌ ముట్టడికి బయలుదేరిన సీపీఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజతోపాటు పలువురు హనుమాన్‌ పేటలోని దాసరి భవన్‌ నుంచి గురువారం ర్యాలీ చేపట్టారు.

రాజ్‌భవన్‌ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు
రాజ్‌భవన్‌ ముట్టడికి బయలుదేరిన కమ్యూనిస్టు నేతలు

విజయవాడ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నగరంలో ని రాజ్‌భవన్‌ ముట్టడికి బయలుదేరిన సీపీఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజతోపాటు పలువురు హనుమాన్‌ పేటలోని దాసరి భవన్‌ నుంచి గురువారం ర్యాలీ చేపట్టారు. వారు దాసరి భవన్‌ నుంచి బయటకు రాగానే కొంతదూరంలో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి వాహనాల్లో గవర్నరుపేట పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. మోదీ అధికారంలోకి వ చ్చాక రాష్ట్రాల హక్కులను గౌరవించడం లేదన్నారు. గవర్నర్లను ఉపయోగించుకుని ప్రభుత్వాలను కూలగొట్టడమే పని గా పెట్టుకున్నారన్నారు. మెజారిటీ లేని రాష్ట్రాల్లోనూ బీజేపీని అధికారంలోకి తీసుకొస్తున్నారన్నారు. తొమ్మిది రాష్ట్రాల్లో ఇలా ప్రభుత్వాలను ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో గవర్నర్‌ వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారన్నారు. గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేసి, ఫెడరలిజాన్ని కాపాడాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. తమ ఉద్యమానికి ప్రజాస్వామ్యవాదులు ముందుకొచ్చి మద్దతు ఇవ్వాలని కోరారు.

Updated Date - 2022-12-30T00:48:34+05:30 IST