పేదల నోటికాడ కూడు లాగేస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-11-03T01:02:33+05:30 IST

వైసీపీ ప్రభుత్వం పేదల నోటికాడ కూడు లాగే స్తోందని, అధిక ధరలు, పన్నుల భారాలు మోయలేక ప్రజలు అల్లాడుతున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ విమర్శించారు.

పేదల నోటికాడ కూడు లాగేస్తున్న ప్రభుత్వం
ఎస్‌ఎస్‌ఆర్‌ కళాశాల వద్ద అన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, కేశినేని శివనాథ్‌(చిన్ని), బుద్దా వెంకన్న

చిట్టినగర్‌, నవంబరు 2: వైసీపీ ప్రభుత్వం పేదల నోటికాడ కూడు లాగే స్తోందని, అధిక ధరలు, పన్నుల భారాలు మోయలేక ప్రజలు అల్లాడుతున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ విమర్శించారు. అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు అన్నం పెడుతుంటే అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని ఫౌం డేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ కేశినేని శివనాఽథ్‌(చిన్ని) ఆధ్వర్యంలో బుధవారం తూర్పు నియోజకవర్గంలోని ఎస్‌ఎస్‌ఆర్‌ కాలేజ్‌ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ప్రారంభించారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న, అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కేశినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మొబైల్‌ క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీర్చుతున్నామని పేర్కొన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా లక్షలాది మంది పేదల ఆకలిని నారా చంద్రబాబునాయుడు తీర్చారని, మరలా ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని ఎమ్మెల్యే గద్దె పిలుపునిచ్చారు.

Updated Date - 2022-11-03T01:02:33+05:30 IST
Read more