ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2022-06-07T06:23:27+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు, బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయాలని, కారుణ్య నియామకాలను చేపట్టాలని తెలుగు యువత నాయకులు సోమవారం రాష్ట్ర ఉపాధి శిక్షణ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలి
ఉపాధి కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న తెలుగు యువత నాయకులు

ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలి

 తెలుగు యువత నాయకుల ధర్నా

విద్యాధరపురం, జూన్‌ 6: ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు, బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయాలని, కారుణ్య నియామకాలను చేపట్టాలని తెలుగు యువత నాయకులు సోమవారం  రాష్ట్ర ఉపాధి శిక్షణ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ డైరెక్టర్‌ మంజులకు ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు నాగూర్‌వలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం, అధికార ప్రతినిధులు సజ్జ అజయ్‌, కవులూరి రాజ, నాయకులు హరిచరణ్‌, బబ్బూరి శ్రీనివాసచౌదరి, రాజ్‌కుమార్‌, చింతోటి మౌళి, లంకా లితిష్‌, తోట రాజేష్‌, పెనుమచ్చ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Read more