ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాల్సిందే

ABN , First Publish Date - 2022-09-29T07:16:58+05:30 IST

హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాల్సిందే

ఉద్యమం ఉధృతం : కొల్లు రవీంద్ర

 తెలుగు మహిళల రిలే దీక్షలు

మచిలీపట్నం టౌన్‌, సెప్టెంబరు 28 : హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర  పేర్కొన్నారు.  మచిలీపట్నం అసెం బ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద బుధవారం తెలుగు మహిళల రిలే దీక్షా శిబిరాన్ని కొల్లు రవీంద్ర ప్రారంభించి ప్రసంగించారు. తెలుగువారి ఆత్మాభిమానాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్‌ పేరును హెల్త్‌ యూనివర్సిటీకి కొనసాగించకపోతే యావత్‌ ఆంధ్రప్రదేశ్‌ అంతా ఉద్యమిస్తుందన్నారు.  ఎన్టీఆర్‌ పేరు మారిస్తే వచ్చే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుం దన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ తెలు గు మహిళ అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ, కార్పొరేటర్లు మరకాని సమతాకీర్తి, చిత్తజల్లు నాగరాము, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ పల్లపాటి సుబ్రహ్మణ్యం, పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, తెలుగు యువత పార్లమెంటు అధ్యక్షుడు వాలిశెట్టి విమనేష్‌,  నగర పార్టీ కార్యదర్శి పిప్పళ్ళ వెంకట కాంతారావు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు లంకే నారాయణ ప్రసాద్‌, మరకాని వాసు, వసంతకుమారి, పల్లపాటి అభినవ్‌ తదితరులు పాల్గొన్నారు.

అన్నదాన కార్యక్రమం 100 రోజులు పూర్తి

 వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్‌ రద్దుతో స్పందించి కొల్లు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమం ప్రారంభించామని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర తెలిపారు.  మచిలీపట్నం చల్లరాస్తా సెంటర్‌లో బుధవారం కొల్లు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నదాన కార్యక్రమం నూరు రోజులు పూర్తయిన సందర్భంగా  కొల్లు రవీంద్ర మాట్లాడారు. పేద, బడుగు వర్గాల ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో అల్లాడుతున్నారన్నారు. పేద కార్మికులు, పింఛను అందని వృద్ధులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కడుపు నింపుకుంటున్నారన్నారు. డాక్టర్‌ బి. ధన్వంతరీ ఆచార్య, టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ మరకాని సమతాకీర్తి, టీడీపీ కార్పొరేటర్‌ చిత్తజల్లు నాగరాము, దేవరపల్లి అనిత, మాజీ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ పల్లపాటి సుబ్రహ్మణ్యం, దేవర ప్రసాద్‌, పల్లపాటి అభినవ్‌, విమనేష్‌ పాల్గొన్నారు.

Read more