కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి : కట్టా

ABN , First Publish Date - 2022-10-05T07:53:54+05:30 IST

రానున్న ఎన్నికల్లో ప్రతి ఓటరును గుర్తించేలా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ మండలాధ్యక్షుడు కట్టా వెంకట నరసింహారావు కో రారు.

కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి : కట్టా

జగ్గయ్యపేట రూరల్‌, అక్టోబరు 4 : రానున్న ఎన్నికల్లో ప్రతి ఓటరును గుర్తించేలా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ మండలాధ్యక్షుడు కట్టా వెంకట నరసింహారావు కో రారు. మండలంలోని పోచంపల్లి గ్రామంలో టీడీపీ బూత్‌ కమి టీ సమావేశాన్ని పార్టీ గ్రామ అధ్యక్షుడు తేళ్లూరి వెంకటకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ గ్రామ స్థాయిలో ఓట్ల పరిస్థితిపై పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్లస్టర్‌ వ్యవస్థలో భాగస్వామ్యమైన బూత్‌, క్లస్ట ర్‌, యూనిట్‌, సెక్షన్‌ హెడ్‌ నాలుగు భాగాలు ఒకరికొకరు సహకరించుకుంటూ క్షేత్రస్థాయిలోని ఓటర్లను పరిశీలించి నూతనంగా ఓట్లు చేర్చే అవకాశం ఉన్నందున వాటిని చేర్చటంతో పాటు అనివార్య కారణాలతో తొలగించబడి గ్రామం నుంచి వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి చెప్పి ఓటు చేర్చేలా చూడాలన్నారు. టీడీపీ గ్రీవెన్స్‌ సెల్‌ రాష్ట్ర కో-కన్వీనర్‌ మల్లంగి రామకృష్ణా రెడ్డి, శ్రీరామ్‌ సాయి, వెంకటరత్నం పాల్గొన్నారు. 

Read more