పిచ్చి ప్రేలాపనలు పేలితే దేహశుద్ధి

ABN , First Publish Date - 2022-09-17T06:35:15+05:30 IST

పిచ్చి ప్రేలాపనలు పేలితే మంత్రి రోజా కు దేహశుద్ధి తప్పదని తెలుగు మహిళ అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర అన్నారు.

పిచ్చి ప్రేలాపనలు పేలితే దేహశుద్ధి

మంత్రి రోజాకు తెలుగు మహిళ హెచ్చరిక

విద్యాధరపురం, సెప్టెంబరు 16 : పిచ్చి ప్రేలాపనలు పేలితే మంత్రి రోజా కు దేహశుద్ధి తప్పదని తెలుగు మహిళ అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర అన్నారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకే్‌షపై మంత్రి రోజా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు రాజకీయభిక్ష పెట్టిన విషయాన్ని రోజా మరచిపోయిందన్నారు. అమరావతి రైతుల మహాపాదయాత్రపై దాడులు జరిగితే పూర్తి బాధ్యత డీజీపీ వహించాల్సి ఉంటుందన్నా రు. రాజధాని రైతులను కడప గూండాల బారి నుంచి కాపాడుకుంటామన్నారు. మహిళలపై అరాచకాలు జరుగుతుంటే మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ ఏమీ మా ట్లాడకపోవడం విచిత్రమన్నారు. వైసీపీ మంత్రుల వద్ద పనిచేసే పీఏలు, కార్యకర్త లు మహిళలపై ఆబోతుల్లా వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు. ఎ మ్మెల్యే కొడాలి నాని పీఎ అరాచకానికి మహిళా వలంటీర్‌ బాధితురాలైందన్నారు. పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళితే సీఐ కూడా వైసీపీ కార్యకర్తలకు మ ద్దతు పలికిన తీరు బాధాకరమన్నారు. వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్న పోలీసులు బాధితులపైనే కేసులు పెడుతున్న పరిస్థితి నెలకొందన్నారు.

Read more