మూడు రాజధానుల అజెండాతో వెలంపల్లి గెలుస్తాడా?

ABN , First Publish Date - 2022-09-17T06:35:48+05:30 IST

ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేసి మూడు రాజధానుల అజెండాతో గెలవాలని టీడీపీ నే తలు సవాల్‌ విసిరారు.

మూడు రాజధానుల అజెండాతో వెలంపల్లి గెలుస్తాడా?

రాజీనామా చేసి పోటీ చేయాలని టీడీపీ నేతల సవాల్‌ 

విద్యాధరపురం, సెప్టెంబరు 16 : ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేసి మూడు రాజధానుల అజెండాతో గెలవాలని టీడీపీ నే తలు సవాల్‌ విసిరారు. మొగల్రాజపురంలోని కేశినేని శివనాథ్‌ (చిన్ని) కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ విజయవాడ పార్లమెంట్‌ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు మాట్లాడుతూ వెలంపల్లి తన నోటి ని అదుపులో పెట్టుకోవాలన్నారు. బుద్దా వెంకన్న అత్యవసరంగా విశాఖ వెళితే క న్నీరు పెట్టుకున్నారని వెలంపల్లి అనడాన్ని ఖండించారు. వెలంపల్లి ఏమైనా దగ్గరుండి చూశాడా అని ప్రశ్నించారు. వెంకన్నపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను రాజీనామా చేయాలంటున్న వెలంపల్లి ముందుగా తానే రాజీనామా చేయాలన్నారు. జగన్‌ వద్ద ఉన్న సర్వే నివేదికలో ఓ డిపోయేవారి జాబితాలో వెలంపల్లి పేరే ముందుందన్నారు. సీనియర్‌ నేత కామా దేవరాజ్‌ మాట్లాడుతూ బుద్దా వెంకన్నను విమర్శించే అర్హత వెలంపల్లికి లేదన్నారు. మైనార్టీ సెల్‌ మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ ఇర్ఫాన్‌, ఎస్సీ నేతలు తుపాకుల వెంకటేశ్వర్లు, మామిడి సత్యం, బీసీ నేత పేరం సత్యనారాయణ పాల్గొన్నారు.

Read more