కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2022-09-10T06:08:56+05:30 IST

సభ్య సమాజంలో జీవించే హక్కు కూడా లేని మాజీ మంత్రి కొడాలి నాని ఇప్పటికైనా భాష మార్చుకోవాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హెచ్చరించారు.

కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ నిరసన
నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో నిరసన

నందిగామ, సెప్టెంబరు 9: సభ్య సమాజంలో జీవించే హక్కు కూడా లేని మాజీ మంత్రి కొడాలి నాని ఇప్పటికైనా భాష మార్చుకోవాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హెచ్చరించారు. చంద్రబాబు, లోకేశ్‌లపై కొడాలి చేసిన వ్యాఖ్యలను ఖండించారు.  ప్రజలు ఛీ కొడుతున్నా కొడాలి నాని తన భాష మార్చుకోకపోవడం దారుణమన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని, ముఖ్యమంత్రి జగన్‌ మెప్పు కోసం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని విమర్శించారు.


 వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న జగన్‌: దేవదత్‌

ఎ.కొండూరు : రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం  అమలు చేస్తూ   ప్రజలు, టీడీపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్న వైసీపీ గూండాలకు సమయం వచ్చినప్పుడు వడ్డీతో చెల్లిస్తామని తిరువూరు టీడీపీ ఇన్‌చార్జి శావల దేవదత్‌ హెచ్చరించారు. ఎ.కొండూరు మండల పార్టీ సమావేశం శుక్రవారం అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. దేవదత్‌ మాట్లాడుతూ వైసీపీకి పాలన చేతకాక, విమర్శలను తట్టుకొలేక టీడీపీ నాయ కుల, కార్యకర్తలపై దాడులకు తెగబడుతోందని ఆరోపించారు. సమావేశంలో గొర్రెల శ్రీధర్‌, కృష్ణారెడ్డి, డేవిడ్‌రాజ్‌, మునియ్య, ప్రసాద్‌, రామారావు, నాగపద్మ,  చంద్రం, దుర్గరావు పాల్గొన్నారు.  

Read more