-
-
Home » Andhra Pradesh » Krishna » TDP nettem-NGTS-AndhraPradesh
-
విద్యా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి
ABN , First Publish Date - 2022-09-10T06:34:28+05:30 IST
జగన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, వాటిని ప్రజలు, విద్యార్థుల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని టీడీపీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు.

టీడీపీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టెం
విద్యాధరపురం, సెప్టెంబరు 9 : జగన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, వాటిని ప్రజలు, విద్యార్థుల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని టీడీపీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. ఆటోనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈనెల 16న స్థానిక ధర్నాచౌక్‌లో టీఎన్‌ఎ్‌సఎఫ్ ఆధ్వర్యంలో జరగనున్న విద్యాగ్రహదీక్షకు సంబందించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఓట్ల కోసం దొంగ హామీలిచ్చిన జగన్ వైఖరిని విమర్శించారు. ఓట్ల కోసం సాధ్యంకాని హామీలిచ్చి, ఇప్పుడు పేద, మధ్యతరగతిని విద్యకు దూరం చేసే విధానాలను అమలు చేస్తున్నాడన్నారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల పరిస్థితి జైళ్లలో ఖైదీలకన్నా హీనంగా ఉందన్నారు. హాస్టళ్లలో వసతులు కరువయ్యాయన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.50 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు. విద్యాగ్రహ దీక్షలో విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలన్న డిమాండ్ ఉంటుందన్నారు. టీఎన్‌ఎ్‌సఎఫ్ నేతలు పుల్లగూర చరణ్‌సాయి, రేపాకుల శ్రీనివాస్, శంకర్ మనోజ్, బుగత రాజశేఖర్, నరేంద్ర చౌదరి, సాయి వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు.