రూ.500 టికెట్‌ను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-10-12T06:06:23+05:30 IST

దుర్గగుడిలో రూ.500 రుసుం టికెట్‌ను రద్దు చేయాలని, సామాన్య భక్తులకనుగుణంగా దర్శన టికెట్ల రేట్లను అమలు చేయాలని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు మాజీ సభ్యులు, టీడీపీ నేతలు వెలగపూడి శంకర్‌బాబు, పద్మశేఖర్‌, పెంచలయ్య మంగళవారం ఈవో భ్రమరాంబను కలిసి వి నతిపత్రం ఇచ్చారు.

రూ.500 టికెట్‌ను రద్దు చేయాలి

దుర్గగుడి ట్రస్ట్‌ బోర్డు మాజీ సభ్యులు

వన్‌టౌన్‌, అక్టోబరు 11 : దుర్గగుడిలో రూ.500 రుసుం టికెట్‌ను రద్దు చేయాలని, సామాన్య భక్తులకనుగుణంగా దర్శన టికెట్ల రేట్లను అమలు చేయాలని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు మాజీ సభ్యులు, టీడీపీ నేతలు వెలగపూడి శంకర్‌బాబు, పద్మశేఖర్‌, పెంచలయ్య మంగళవారం ఈవో భ్రమరాంబను కలిసి వి నతిపత్రం ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సామాన్య, పేద, మధ్యతరగతి భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనతోపాటు టికెట్‌ ధరలు అందుబాటులో ఉండేలా చూడాలి కానీ భారీగా ధరలు పెంచడం సరికాదన్నారు. సాధారణ టికెట్లను అమలు చేసి, రూ.300 టికెట్‌తో దర్శనం చేసుకున్న భక్తులకు అమ్మవారి లడ్డు ప్రసాదంతో పాటు కనకదుర్గ ప్రభ పుస్తకాన్ని అందచేయాలన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో క్లోక్‌ రూమ్‌, చెప్పుల స్టాండ్‌ ఉచితంగా అందుబాటులో ఉంచామన్నారు. అనంతరం రూ.500 టికెట్‌తో అమ్మవారిని దర్శించుకున్నారు.

Updated Date - 2022-10-12T06:06:23+05:30 IST