టీడీపీ సీనియర్‌ నాయకుడు నాదెళ్ల ఆంజనేయులు కన్నుమూత

ABN , First Publish Date - 2022-09-25T06:56:06+05:30 IST

టీడీపీ సీనియర్‌ నాయకుడు నా దెళ్ల ఆంజనేయులు (85) కొత్తమాజేరులోని స్వగృహంలో శుక్రవారం రాత్రి కన్నుమూశారు.

టీడీపీ సీనియర్‌ నాయకుడు   నాదెళ్ల ఆంజనేయులు కన్నుమూత
బుద్ధప్రసాద్‌ తదితరుల నివాళి

చల్లపల్లి, సెప్టెంబరు 24 : టీడీపీ సీనియర్‌ నాయకుడు నా దెళ్ల ఆంజనేయులు (85) కొత్తమాజేరులోని స్వగృహంలో శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆంజనేయులు భౌతికకాయాన్ని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, చల్లపల్లి సర్పంచ్‌ పైడిపాముల కృష్ణకుమారి, మండల టీడీపీ అధ్యక్షుడు మోర్ల రాంబాబు, ఎంపీటీసీ మాలెంపాటి కాంచనరావు, బొర్రా అగ్గిరాముడు, టీడీపీ నేతలు, వివిధ వర్గాల ప్రముకులు సందర్శించి నివాళులు అర్పించారు. ఆంజనేయులు కుమారుడు, పెట్రోల్‌ బంకు అధినేత నాదెళ్ల పూర్ణ  కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియజేశారు. ఆయన కోరిక మేరకు విజయవాడ ఎల్‌.వి.ప్రసాద్‌ ఆసుపత్రి వైద్యులు ఆంజనేయులు నేత్రాల కార్నియాలు సేకరించారు. 

Read more