Devineni Uma: లోకేష్ యువగళమై.. ఇవ్వగలమై వస్తున్నారు..

ABN , First Publish Date - 2022-12-30T15:33:40+05:30 IST

ఎన్టీఆర్ జిల్లా: రాష్ట్రమంతా 4 వందల రోజులు 4 వేల కిలోమీటర్లు నారా లోకేష్ యువగళమై.. ఇవ్వగలమై వస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు.

Devineni Uma: లోకేష్ యువగళమై.. ఇవ్వగలమై వస్తున్నారు..

ఎన్టీఆర్ జిల్లా: రాష్ట్రమంతా 4 వందల రోజులు 4 వేల కిలోమీటర్లు నారా లోకేష్ (Nara Lokesh) యువగళమై.. ఇవ్వగలమై వస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ (Devineni Uma) అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ రెడ్డి (CM Jagan) పాదయాత్రలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని, 43 నెలల కాలంలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. మెగా డీఎస్సీలు అన్నారు, టీచర్ ఉద్యోగాలు అన్నారు... యువత ఆస్తులు అమ్ముకొని లక్షల రూపాయలు ఖర్చుపెట్టి హైదరాబాదు, బెంగళూరు పక్క రాష్ట్రాల్లో టీచర్ ట్రైనింగులు చేశారని, ఇవాళ వారంతా రోడ్డు మీద ఉన్నారన్నారు. నాలుగు లక్షల ఉద్యోగాలు, జాబు క్యాలెండర్ ఏమైపోయాయని ప్రశ్నించారు.

రేపు ఇవ్వగలమై వస్తున్న నారా లోకేష్ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తారని దేవినేని ఉమ అన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, ఇరిగేషన్ ప్రాజెక్టులు నాశనం చేశారని, విదేశీ పెట్టుబడులు ఏమయ్యాయని ప్రశ్నించారు. అవినీతిపరులైన కొండపల్లి మున్సిపాలిటీ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే కలిసి 13 నెలలుగా గెలిచిన టీడీపీ కౌన్సిలర్లను ప్రమాణ స్వీకారం చేయనివ్వకుండా మున్సిపాలిటీని భ్రష్టు పట్టించారని దేవినేని ఉమ మండిపడ్డారు.

Updated Date - 2022-12-30T15:33:40+05:30 IST

Read more