పేదవాడి ఆకలి తీర్చాలన్నదే టీడీపీ ఆకాంక్ష

ABN , First Publish Date - 2022-12-10T01:09:55+05:30 IST

ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు పేదవాడి ఆకలి తీర్చాలన్నదే టీడీ పీ ప్రధాన ఆకాంక్ష అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొ లిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

పేదవాడి ఆకలి తీర్చాలన్నదే టీడీపీ ఆకాంక్ష

గుణదల, డిసెంబరు 9 : ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు పేదవాడి ఆకలి తీర్చాలన్నదే టీడీ పీ ప్రధాన ఆకాంక్ష అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొ లిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీ నేత కేశినేని శివనాథ్‌ సౌజన్యంతో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఆధ్వర్యంలో స్థానిక 26వ డివిజన్‌ పరిధిలోని నార్ల వారి వీధిలో మొబైల్‌ అన్న క్యాంటీన్‌ ద్వారా పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ 40 ఏ ళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు పేదవాడి ఆకలి తీర్చే ఆలోచనతో 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు నిర్వహించిన విష యం అందరికీ తెలిసిందేనన్నారు. ఒక్క అవకాశమ ని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన రెడ్డి అ న్న క్యాంటీన్లను రద్దుచేసి పేదవాడి కడుపుపై ఆకలి దెబ్బ కొట్టి పాపం మూటకట్టుకున్నారని దుయ్యపట్టారు. 26వ డివిజన్‌ ఇన్‌చార్జ్‌ వల్లభనేని సతీష్‌, 26 వ డివిజన్‌ కార్పొరేటర్‌ వల్లభనేని రాజేశ్వరి, డివిజన్‌ అధ్యక్షుడు తోట పాండు పాల్గొన్నారు.

అన్నదానం మహోపకారం

వన్‌టౌన్‌ : అన్నదానం మహోపకారమని 52వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చం టి) అన్నారు. డివిజన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మొబైల్‌ అన్న క్యాంటీన్‌ను నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్నార్తులకు పట్టెడన్నం పెట్టడంలో ఉండే ఆనందం మరెక్కడా లభించదన్నారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను జగన్‌రెడ్డి రద్దు చేశాడని, టీడీపీ నేతల ఆధ్వర్యంలో మొబైల్‌ క్యాంటీన్లను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కేశినేని ఫౌండేషన్‌ ట్రస్టీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పార్టీ అధికార ప్రతినిధి నాగుల్‌మీరా సంయుక్త ఆధ్వర్యంలో మొబైల్‌ అన్న క్యాంటీన్‌ను నిర్వహించారు. కాండ్రేగుల రవీంద్ర, సాదరబోయిన ఏడుకొండలు, ఈగల సాంబ, గ ణప రాము, దేవరాజు, కొట్టేటి హనుమంతరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T01:09:56+05:30 IST