పార్టీ కార్యాలయం ఏర్పాటు అభినందనీయం

ABN , First Publish Date - 2022-10-05T07:54:38+05:30 IST

కంచికచర్ల టీడీపీ మండలాధ్యక్షుడు కోగంటి బాబు జన్మదినం సందర్భంగా మండలంలోని కీసర గ్రామంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయ టం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు.

పార్టీ కార్యాలయం ఏర్పాటు అభినందనీయం

మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

కంచికచర్ల రూరల్‌, అక్టోబరు 4 : కంచికచర్ల టీడీపీ మండలాధ్యక్షుడు కోగంటి బాబు జన్మదినం సందర్భంగా మండలంలోని కీసర గ్రామంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయ టం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ అబివృద్ధికి కృషి చేయటంతో పాటు కార్యకర్తల కష్టసుఖాలలో పాలు పంచుకుంటున్న గొప్ప వ్యక్తన్నారు. ఇటువంటి జన్మదిన వేడుకలను బాబు మరె న్నో జరుపుకోవాలని కోరుతూ జన్మదిన కేక్‌ను కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 

కీసర గ్రామానికి చెందిన దామాల రమేష్‌, కలతోటి సిలువరాజాతో పాటు ఎనిమి ది కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మన్నే సాత్విక, కుమా రి, స్వర్ణకుమారి, పలువురు నేతలు పాల్గొన్నారు.

Read more