తహసీల్దార్‌ చిలకలపూడి పాఠశాల సందర్శన

ABN , First Publish Date - 2022-09-25T06:58:36+05:30 IST

చిలకలపూడి మునిసిపల్‌ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకం అమలును తహసీల్దార్‌ సునీల్‌ బాబు శనివారం పరిశీలించారు

తహసీల్దార్‌ చిలకలపూడి పాఠశాల సందర్శన

మచిలీపట్నం టౌన్‌ : చిలకలపూడి మునిసిపల్‌ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకం అమలును తహసీల్దార్‌ సునీల్‌ బాబు శనివారం పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకంపై వచ్చిన కథనానికి ఆర్డీవో కిషోర్‌ స్పందించారు. విద్యార్థులతో మాట్లాడారు. వంట ఏజెన్సీని ప్రశ్నించారు. ప్రధానోపాధ్యాయురా లు కనకదుర్గ నుంచి వివరాలు తెలుసుకున్నారు. వాస్తవాలను కలెక్టర్‌కు నివేదిస్తామని తహసీల్దార్‌ తెలిపారు.  

Read more