హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలి

ABN , First Publish Date - 2022-09-27T06:14:37+05:30 IST

హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలి

హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలి
రిలే దీక్షల్ని ప్రారంభిస్తున్న స్వామిదాసు, దేవదత్‌

తిరువూరు, సెప్టెంబరు 26: హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరునే కొనసాగించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లగట్ల స్వామిదాసు, పార్టీ తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి శావల దేవదత్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ దేవదత్‌ ఆధ్వర్యంలో టీడీపీ బీసీ సెల్‌ విభాగం చేపట్టిన రిలే నిరాహర దీక్షల్ని స్వామిదాసు ప్రారంభించారు. రిలేదిక్షలో కందిమళ్ల శేషగిరిరావు, సిందు శ్రీను, మినుగు శ్రీను, మార్కండేశ్వరరావు, పంది శ్రీను, బండి ముత్యం కుర్చున్నారు. సాయంత్రం బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు  కాసు మల్లిఖార్జునరావు దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. రిలే దీక్షల ప్రారంభంలో జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ నల్లగట్ల సుధారాణి, బొమ్మసాని మహేష్‌, అబ్దుల్‌ హుస్సేన్‌, నాళ్లా సురేంద్ర, ఆకుల దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.Read more