స్వచ్ఛమైన నీటినే తాగాలి

ABN , First Publish Date - 2022-11-16T01:11:04+05:30 IST

స్వచ్ఛమైన తాగునీటితోనే మనిషి ఆరోగ్యకరంగా జీవించగలుగుతాడని, తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వుందని, ఎంపీడీవో జీఎస్‌వీ శేషగిరిరావు అన్నారు. మండల కేంద్రమైన ఉంగుటూరులో సర్పంచ్‌ కె.వరప్రసాద్‌, ఎంపీడీవో ఆధ్వర్యంలో జలజీవన్‌ మిషన్‌పై గ్రామంలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు.

 స్వచ్ఛమైన నీటినే తాగాలి
జలజీవన్‌ మిషన్‌ స్వచ్ఛతా ర్యాలీలో అధికారులు

ఉంగుటూరు, నవంబరు 15 : స్వచ్ఛమైన తాగునీటితోనే మనిషి ఆరోగ్యకరంగా జీవించగలుగుతాడని, తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వుందని, ఎంపీడీవో జీఎస్‌వీ శేషగిరిరావు అన్నారు. మండల కేంద్రమైన ఉంగుటూరులో సర్పంచ్‌ కె.వరప్రసాద్‌, ఎంపీడీవో ఆధ్వర్యంలో జలజీవన్‌ మిషన్‌పై గ్రామంలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛమైన నీరు తాగుదాం, ఆరోగ్యంగా జీవించుదాం, జల సంరక్షణే జన సంరక్షణ, జలమే జగతికి ప్రాణం, జలమే ప్రగతికి మూలాధారం అనే నినాదాలతో గ్రామపురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. జలజీవన్‌ మిషన్‌ మండల కోఆర్డినేటర్లు బి.కుమారి, టి.అనూరాధ, పంచాయతీ కార్యదర్శి, ఉపాధిహామీ పథకం సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T01:11:06+05:30 IST