స్వచ్ఛ సంకల్పంపై దృష్టి సారించండి

ABN , First Publish Date - 2022-11-25T02:12:23+05:30 IST

జిల్లాలో స్వచ్ఛ సంకల్పం కార్యక్రమ విజయవంతానికి అధికారులు కృషి చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌ రంజిత్‌బాషా అన్నారు.

స్వచ్ఛ సంకల్పంపై దృష్టి సారించండి

మచిలీపట్నం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో స్వచ్ఛ సంకల్పం కార్యక్రమ విజయవంతానికి అధికారులు కృషి చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌ రంజిత్‌బాషా అన్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ట ద్వివేది గురువారం కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్భిని కలెక్టర్‌ వివరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ, జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా గ్రామ సచివాలయాల వద్ద 404 కమ్యూనిటీ శానిటరీ కాంపెక్స్‌ల నిర్మాణం చేసేందుకు అనుమతులు ఇచ్చామన్నారు. వీటిలో 310 ఇప్పటికే పూర్తిచేశామని, మిగిలిన వాటిని పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 491 గ్రామ సచివాలయాల్లో 472 చెత్తనుంచి సంపద కేంద్రాల తయారీ కేంద్రాలను నిర్మాణం చేశామని, మిగిలిన వాటిపై అధికారులు చొరవతీసుకోవాలన్నారు. సచివాలయాలు, ఆర్‌బీకేలు, వైఎస్సార్‌ హెల్త్‌క్లినిక్‌ల భవన నిర్మాణాలను డిసెంబరు నాటికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో జి.శ్రీనివాసరావు, డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, డీపీవో నాగేశ్వరనాయక్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌.వీరాస్వామి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. రు.

Updated Date - 2022-11-25T02:12:25+05:30 IST