అనుబంధ కమిటీలను బలోపేతం చేయాలి

ABN , First Publish Date - 2022-09-11T06:04:02+05:30 IST

అనుబంధ కమిటీలను పూర్తిచేసి పార్టీ బలోపే తానికి కృషి చేయాలని టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి శావల దేవదత్‌, నియోజకవర్గం పరిశీలకుడు గొర్ల శ్రీకాంత్‌ అన్నారు.

అనుబంధ కమిటీలను బలోపేతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న దేవదత్‌

టీడీపీ సమావేశంలో శావల దేవదత్‌

తిరువూరు : అనుబంధ కమిటీలను పూర్తిచేసి పార్టీ బలోపే తానికి కృషి చేయాలని టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి శావల దేవదత్‌, నియోజకవర్గం పరిశీలకుడు గొర్ల శ్రీకాంత్‌ అన్నారు. శనివారం నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో పట్టణ, మండల కమిటీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెక్షన్‌, యూనిట్‌ ఇన్‌చార్జిలు ఓటరు జాబితాపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. తమపరిధిలో ఓటర్ల జాబితాను పరిశీలించి చనిపోయిన వారు, డబుల్‌ ఎంట్రీలను తొలగించేలా అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం, నూతన ఓటర్ల నమోదుకు దరఖాస్తుల స్వీకరణలో ప్రభుత్వం వలంటీర్లను వినియోగించి,  ప్రతిపక్షాలకు చెందిన ఓట్లు తొలగింపుతోపాటు నూతనంగా ఓటరు నమోదు చేసుకోకుండా కుట్రపన్నుతుందని ఆరోపించారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొమ్మసాని మహేష్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వెదురు వెంకటనర్సిరెడ్డి, వాసం మునియ్య, తాళ్ళూరి రామారావు, మాదాల హరిచరణ్‌(కిట్టు), సుంకర కృష్ణమోహన్‌, కందిమళ్ళ శేషగిరిరావు, దొడ్డా లక్ష్మణరావు, గద్దె వెంకటేశ్వరరావు,  తదితరులు పాల్గొన్నారు. 

Read more