ముక్త్యాల తిరునాళ్లకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలి: సబ్‌ కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-02-19T06:33:08+05:30 IST

ముక్త్యాల తిరునాళ్లకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలి: సబ్‌ కలెక్టర్‌

ముక్త్యాల తిరునాళ్లకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలి: సబ్‌ కలెక్టర్‌

జగ్గయ్యపేట రూరల్‌, ఫిబ్రవరి 18: మహాశివరాత్రికి ముక్త్యాల తిరునాళ్లకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించి, ఇబ్బంది కలగకుండా చూడాలని విజయవాడ సబ్‌కలెక్టర్‌ జీఎస్‌ఎస్‌ ప్రవీణ్‌చంద్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ముక్త్యాలలో భవానీ ముక్తేశ్వరస్వామి దేవస్థానంలో దేవదాయశాఖ, పోలీస్‌, రెవెన్యూ, ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య శాఖ, ఆర్‌ అండ్‌ బీ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వంశపారంపర్య ధర్మకర్తలు ముక్త్యాల రాజకుటుంబీకుల తరఫున రామ్‌ప్రసాద్‌, తహసీల్దార్‌ వైకుంఠరావు, డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ చంద్రశేఖర్‌, ఎంపీడీవో జయచంద్ర, ఈవో వాసిరెడ్డి భూపాలరావు పాల్గొన్నారు.

Read more