కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలి: కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్

ABN , First Publish Date - 2022-06-12T16:09:25+05:30 IST

Vijayawada: ప్రజలకు సేవ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ సూచించారు. మెజారిటీ నిధులు కేంద్రం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలి: కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్

Vijayawada: ప్రజలకు సేవ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ సూచించారు. మెజారిటీ నిధులు కేంద్రం నుంచి వస్తున్నా, కనీసం ప్రధాని ఫొటో కూడా ఎక్కడా ముద్రించడం లేదని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో రెండు రోజుల పర్యటనలో ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఆమె ఇంకా ఇలా అన్నారు...

‘‘కేంద్రం అమలు చేస్తున్న ఎన్నో పథకాలు పేదలకు ఆసరాగా నిలుస్తున్నాయి. ఆయుష్మాన్ భవ పథకం ద్వారా కోట్లాది మందికి వైద్య సేవలు అందుతున్నాయి. ఏపీలో ఈ పథకానికి 90శాతం నిధులను కేంద్రం కేటాయించింది. నాణ్యమైన వైద్య విద్య కోసం మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశాం. గత ఏడేళ్లల్లో 209 మెడికల్ కాలేజీలు కేటాయించాం. 159 మెడికల్ కాలేజీలు కొత్తగా మంజూరు చేశాం. ఏపీలో కరోనా వ్యాక్సిన్ 99 శాతం పూర్తి చేయడం అభినందనీయం. మంగళగిరి ఎయిమ్స్‌కి రూ.1618 కోట్లు కేంద్రం కేటాయించింది. మహిళా సాధికారిత సాధించేందుకు మోడీ అనేక కార్యక్రమాలు‌ చేపట్టారు’’ అని వివరించారు.

Updated Date - 2022-06-12T16:09:25+05:30 IST