వైద్యుల సిఫార్సు లేకుండా స్పిరిట్‌ విక్రయించొద్దు

ABN , First Publish Date - 2022-08-31T06:39:10+05:30 IST

వైద్యుల సిఫార్సు లేకుండా స్పిరిట్‌ విక్రయించొద్దు

వైద్యుల సిఫార్సు లేకుండా స్పిరిట్‌ విక్రయించొద్దు

గన్నవరంలో ఎస్‌ఈబీ అధికారుల ప్రదర్శన 

గన్నవరం, ఆగస్టు 30 : వైద్యుల సిఫార్సు లేకుండా స్పిరిట్‌, సర్జికల్‌ స్పిరిట్‌ విక్రయించకూడదని స్పెషల్‌ ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) ఇన్‌స్పెక్టర్‌ బి.వరాలరాజు అన్నారు. మంగళవారం స్థానిక ఎస్‌ఈబీ స్టేషన్‌లో మెడికల్‌ షాపుల నిర్వాహకులతో సమావేశం  నిర్వహించి ‘డ్రగ్స్‌ వద్దు-జీవితమే ముద్దు’ అంటూ ప్రజలకు అవగా హన కల్పిస్తు ప్రదర్శన చేశారు.  ఎస్సై ఎంఎస్‌ఎన్‌ శాస్ర్తి, మెడికల్‌ షాప్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. 

Read more