కానిస్టేబుల్‌ నాగరాజుకు ఎస్పీ అభినందన, రివార్డు

ABN , First Publish Date - 2022-11-25T02:17:20+05:30 IST

మంగినపూడి బీచ్‌లో కొట్టుకుపోతున్న నలుగురు విజయవాడ యువకులను రక్షించిన కానిస్టేబుల్‌ నాగరాజును జిల్లా ఎస్పీ జాషువా సత్కరించారు

 కానిస్టేబుల్‌ నాగరాజుకు ఎస్పీ అభినందన, రివార్డు

మచిలీపట్నం టౌన్‌, నవంబరు 24 : మంగినపూడి బీచ్‌లో కొట్టుకుపోతున్న నలుగురు విజయవాడ యువకులను రక్షించిన కానిస్టేబుల్‌ నాగరాజును జిల్లా ఎస్పీ జాషువా సత్కరించారు. ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి యువకులను రక్షించిన నాగరాజుకు ఎస్పీ రివార్డు అందజేసి అభినందించారు. నాగరాజును డీజీపీ కూడా అభినందించారన్నారు. నాగరాజు పేరును అత్యున్నత అవార్డుకు సిఫార్సు చేస్తున్నామన్నారు.

Updated Date - 2022-11-25T02:17:20+05:30 IST

Read more