ఏపీ రాజధానిపై సోమువీర్రాజు కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-01-03T21:42:03+05:30 IST

కృష్ణా జిల్లా: ఏపీ రాజధానిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీ రాజధానిపై సోమువీర్రాజు కీలక వ్యాఖ్యలు

కృష్ణా జిల్లా: ఏపీ రాజధానిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన పెనుగంచిప్రోలులో మీడియాతో మాట్లాడుతూ అమరావతిని తాము రూ. 10వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని అన్నారు. 2024లో తాము అధికారంలోకి వచ్చి  మూడు విడతల్లో అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు. పెనగంచిప్రోలు అమ్మవారి సాక్షిగా తాను ఈ హామీ ఇస్తున్నానని వీర్రాజు ప్రకటించారు. రాజధాని నిర్మిస్తామన్న చంద్రబాబు కట్టలేకపోయారని, అధికారంలోకి వచ్చిన జగన్ వైజాగ్ వెళ్లిపోతామంటున్నారని.. ఇక రాజధానిని తామే నిర్మాణం చేస్తామన్నారు. రూ. 10వేల కోట్లతో అత్యద్భుతమైన రాజధానిని నిర్మిస్తామని సోమువీర్రాజు మరొకసారి స్పష్టం చేశారు.

Read more