కేంద్రం బడ్జెట్‌పై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి: సోమువీర్రాజు

ABN , First Publish Date - 2022-02-23T18:25:05+05:30 IST

కేంద్రం బడ్జెట్‌పై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

కేంద్రం బడ్జెట్‌పై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి: సోమువీర్రాజు

విజయవాడ: కేంద్రం బడ్జెట్‌పై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, అందుకే మేధావులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీ విభజన జరిగాక రాష్ట్రానికి దిశ, దశ లేకుండా పోయిందన్నారు. 13 జిల్లాల్లో‌ ఉన్న వనరులు, సముద్ర తీర ప్రాంతాలను వినియోగించుకోవాలన్నారు. ఏపీకి కేంద్రమంత్రి నితిన్ గడ్కరి రూ. 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్దం అని ప్రకటించారన్నారు. ఏపీని పాలించిన గత, ప్రస్తుత పాలకులు అంచనాలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్ర ఆర్ధిక ప్రగతిని సరైన మార్గంలో తీసుకెళ్లలేదని, అనవసర అంశాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర అభివృద్ధి లేకుండా చేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు.


నిర్మాణాత్మకమైన ఆలోచనలు చేయకపోవడం రాష్ట్ర అభివృద్ధికి అరిష్టని సోము వీర్రాజు అన్నారు. రాజధానిని ఐదేళ్లలో చంద్రబాబు కట్టలేదని, అధికారంలోకి వస్తే రాజధాని నిర్మిస్తానని చెప్పిన జగన్.. అసలు రాజధానే లేకుండా చేశారని దుయ్యబట్టారు. ప్రజలను కూడా  రాజధాని  విషయంలో అయోమయంలోకి నెట్టారన్నారు. రాష్ట్రంలో పరిస్థితిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ఒక్క మోదీ సారధ్యంలోని బీజేపీకే సాధ్యమని అన్నారు. ప్రజలు కూడా ఆలోచన చేసి కుటుంబ పాలకులకు బుద్ధి చెప్పాలని సోము వీర్రాజు పిలుపు ఇచ్చారు.

Updated Date - 2022-02-23T18:25:05+05:30 IST