శివాలయాల్లో కార్తీక శోభ

ABN , First Publish Date - 2022-11-08T01:21:58+05:30 IST

యనమలకుదురు శివాలయంలో స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. కార్తీక మాస రెండవ సోమవారం, పౌర్ణమి కూడా కావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. స్వా మివారికి ఉదయం రుద్రాభిషేకం అనంత రం పార్వతీదేవికి కుంకుమార్చన నిర్వహిం చారు.శివసౌధం నందు స్వామివారికి, అమ్మ వారికి శాంతికల్యాణం నిర్వహించారు.

 శివాలయాల్లో కార్తీక శోభ
పెరికీడు శివాలయంలో జ్వాలాతోరణం

పెనమలూరు, నవంబరు 7 : యనమలకుదురు శివాలయంలో స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. కార్తీక మాస రెండవ సోమవారం, పౌర్ణమి కూడా కావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. స్వా మివారికి ఉదయం రుద్రాభిషేకం అనంత రం పార్వతీదేవికి కుంకుమార్చన నిర్వహిం చారు.శివసౌధం నందు స్వామివారికి, అమ్మ వారికి శాంతికల్యాణం నిర్వహించారు. పోరంకి, పెనమలూరు శివాలయాల్లో భక్తు లు వేకువఝాము నుంచే స్వామి దర్శనం కోసం బారులు తీరారు.

ఉయ్యూరు : కార్తీకమాస రెండవ సోమ వారం పురస్కరించుకుని ఉయ్యూరు పట్టణ, మండల పరిధి గ్రామాల్లో శివాల యాలు భక్తులతో కిక్కిరిశాయి. వేకువజాము నుంచి భక్తులు ఆలయాలకు చేరుకుని దీపా రాధనలు, పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. సోమే శ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి భక్తులు తాకిడి కన్పిం చగా అసౌకర్యం కలగ కుండా ఆలయ పాలక మండలి చైర్మన్‌ కుటుంబరాజు పర్యవే క్షించారు. పెదఓగిరాల, చినఓగిరాల, ముదు నూరు, కాటూరు, బోళ్ల పాడు, ఆకునూరు, శా యిపురం శివాలయా లకు భక్తులు తరలివచ్చారు.

హనుమాన్‌జంక్షన్‌ : పెరికీడు ముక్తేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, అభిషే కాలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో జ్వాలా తోరణం వెలిగించారు. భక్తులు భారీఎత్తున పాల్గొన్నారు. దీనికి ముందు ఆలయంలోని స్వామి వారిని పల్లకీలో ఆలయ ప్రదక్షిణ చేసి అనంతరం జ్వాలాతోరణాన్ని వెలిగించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు పెద్ద ఎత్తున దీపా రాధన కార్యక్రమాన్ని న్విహించారు. జ్వాలా తోరణం దర్శనం కోసం భక్తులు బారులుతీరి చేసిన శివ నామస్మరణతో ఆలయం మారు మ్రోగింది. ఆలయ అర్చకులు శ్యామ్‌ పూజా కార్యక్రమాలు జరిపారు. ఆలయ కమిటీ సభ్యులు నండూరు సత్యవెంకటేశ్వరశర్మ, నక్కాబాబు, తవ్వా మూర్తి, విజయ్‌, ఏర్పా ట్లను పర్యవేక్షించారు. పలువురు భక్తులు పల్లకీ సేవలో పాల్గొన్నారు. చంద్ర గ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 10గంటల నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్న ట్లు నిర్వాహకులు తెలిపారు.

గన్నవరం : స్థానిక కోనాయి చెరువు సమీపంలోని విశ్వేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం రెండవ సోమవారం సంద ర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు ఎం.సాంబశి వరావు నేతృత్వంలో స్వామివారికి పసుపు కుంకుమతో అభిషేకాలు జరిపారు. అనం తరం అమ్మవారికి గాజులతో ప్రత్యేక అలం కరణ చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగ ణంలో భక్తిశ్రద్ధలతో జ్వాలాతోరణ మహో త్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు కార్తీక దీపాలు వెలిగించి పూజలు జరిపారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేశారు. కేసరపల్లి రామలింగేశ్వరస్వామి ఆలయ గుమ్మడి నాగేంద్ర క్షేత్రంలో, దావాజీ గూడెంలోని శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు పూజలు నిర్వహించారు. శివాలయాల్లో కార్తీక శోభ

పెరికీడు శివాలయంలో జ్వాలాతోరణం

పెనమలూరు, నవంబరు 7 : యనమలకుదురు శివాలయంలో స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. కార్తీక మాస రెండవ సోమవారం, పౌర్ణమి కూడా కావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. స్వా మివారికి ఉదయం రుద్రాభిషేకం అనంత రం పార్వతీదేవికి కుంకుమార్చన నిర్వహిం చారు.శివసౌధం నందు స్వామివారికి, అమ్మ వారికి శాంతికల్యాణం నిర్వహించారు. పోరంకి, పెనమలూరు శివాలయాల్లో భక్తు లు వేకువఝాము నుంచే స్వామి దర్శనం కోసం బారులు తీరారు.

ఉయ్యూరు : కార్తీకమాస రెండవ సోమ వారం పురస్కరించుకుని ఉయ్యూరు పట్టణ, మండల పరిధి గ్రామాల్లో శివాల యాలు భక్తులతో కిక్కిరిశాయి. వేకువజాము నుంచి భక్తులు ఆలయాలకు చేరుకుని దీపా రాధనలు, పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. సోమే శ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి భక్తులు తాకిడి కన్పిం చగా అసౌకర్యం కలగ కుండా ఆలయ పాలక మండలి చైర్మన్‌ కుటుంబరాజు పర్యవే క్షించారు. పెదఓగిరాల, చినఓగిరాల, ముదు నూరు, కాటూరు, బోళ్ల పాడు, ఆకునూరు, శా యిపురం శివాలయా లకు భక్తులు తరలివచ్చారు.

హనుమాన్‌జంక్షన్‌ : పెరికీడు ముక్తేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, అభిషే కాలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో జ్వాలా తోరణం వెలిగించారు. భక్తులు భారీఎత్తున పాల్గొన్నారు. దీనికి ముందు ఆలయంలోని స్వామి వారిని పల్లకీలో ఆలయ ప్రదక్షిణ చేసి అనంతరం జ్వాలాతోరణాన్ని వెలిగించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు పెద్ద ఎత్తున దీపా రాధన కార్యక్రమాన్ని న్విహించారు. జ్వాలా తోరణం దర్శనం కోసం భక్తులు బారులుతీరి చేసిన శివ నామస్మరణతో ఆలయం మారు మ్రోగింది. ఆలయ అర్చకులు శ్యామ్‌ పూజా కార్యక్రమాలు జరిపారు. ఆలయ కమిటీ సభ్యులు నండూరు సత్యవెంకటేశ్వరశర్మ, నక్కాబాబు, తవ్వా మూర్తి, విజయ్‌, ఏర్పా ట్లను పర్యవేక్షించారు. పలువురు భక్తులు పల్లకీ సేవలో పాల్గొన్నారు. చంద్ర గ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 10గంటల నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్న ట్లు నిర్వాహకులు తెలిపారు.

గన్నవరం : స్థానిక కోనాయి చెరువు సమీపంలోని విశ్వేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం రెండవ సోమవారం సంద ర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు ఎం.సాంబశి వరావు నేతృత్వంలో స్వామివారికి పసుపు కుంకుమతో అభిషేకాలు జరిపారు. అనం తరం అమ్మవారికి గాజులతో ప్రత్యేక అలం కరణ చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగ ణంలో భక్తిశ్రద్ధలతో జ్వాలాతోరణ మహో త్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు కార్తీక దీపాలు వెలిగించి పూజలు జరిపారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేశారు. కేసరపల్లి రామలింగేశ్వరస్వామి ఆలయ గుమ్మడి నాగేంద్ర క్షేత్రంలో, దావాజీ గూడెంలోని శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు పూజలు నిర్వహించారు.

Updated Date - 2022-11-08T01:21:58+05:30 IST

Read more