గంజాయి ఎగుమతిలో మొదటి స్థానం సిగ్గుచేటు

ABN , First Publish Date - 2022-10-02T06:06:55+05:30 IST

గంజాయి ఎగుమతిలో మొదటి స్థానం సిగ్గుచేటు

గంజాయి ఎగుమతిలో మొదటి స్థానం సిగ్గుచేటు
మాట్లాడుతున్న తెలుగుయువత నాయకులు

 హనుమాన్‌జంక్షన్‌, అక్టోబరు 1: నిరుద్యోగ యువత పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న బడుగు వికాసం పథకం ద్వారాఅందిస్తున్న సబ్సిడీ రుణ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమల అభివృద్ధి సంస్థ జిల్లా జీఎం ఆర్‌.వెంకటరావు పేర్కొన్నారు. శనివారం బాపులపాడు మండల పరిషత్‌ కార్యాలయంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ, 2020-23 నూతన పారిశ్రామిక విధానంపై ఔత్సాహిక యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు నెలకొల్పే జనరల్‌ కేటగిరీ,  బీసీ, మైనార్టీ వర్గాలకు 15 శాతం సబ్సిడీ, బీసీ, మైనార్టీ మహిళలకు 35శాతం సబ్సిడీ గరిష్టంగా రూ.20 లక్షల రుణసాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీఐఐసీ పారిశ్రమికవాడల్లో పరిశ్రమలకు కావలసిన భూములను సబ్సిడీపై విక్రయి స్తున్నట్లు తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మహిళలకు భూమి కొనుగోలు ధరలో 50శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పఽథకం ద్వారా పరి శ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జీఎం వివరించారు. ఎంపీపీ  వై.నగేష్‌, ఎంపీడీవో కె.ప్రభాకరరావు, జిల్లా పరి శ్రమల డీడీ డి.విజయ్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శులు, ఔత్సాహిక యువకులు పాల్గొన్నారు.



Updated Date - 2022-10-02T06:06:55+05:30 IST