-
-
Home » Andhra Pradesh » Krishna » seminar about pollution conducted at siddhartha womens college-NGTS-AndhraPradesh
-
కాలుష్యాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ
ABN , First Publish Date - 2022-06-07T06:21:28+05:30 IST
భూమిపై రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పర్యావరణవేత్త తుమ్మల శ్రీకుమార్ అన్నారు

కాలుష్యాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ
లబ్బీపేట, జూన్ 6: భూమిపై రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పర్యావరణవేత్త తుమ్మల శ్రీకుమార్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్ధార్థ మహిళా కళాశాలలో సోమవారం కళాశాల ఎకో క్లబ్, పర్యావరణ వేదిక సంయుక్త ఆధ్యర్యంలో మనకు ఉన్నది ఒకే భూమి అనే అంశంపై సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని, పర్యవరణ రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, భూగర్భ జలాలను సంరక్షించే చర్యలు చేపట్టాలని, వర్షపు నీటిని సంరక్షించాలని, ప్రధానంగా అడవులను కాపాడుతూ, చెట్లను పెంచాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణ సమితి కన్వీనర్ వి.శ్రీనివాసరావు, జనవిజ్ఞాన వేదిక కార్యకర్త శివప్రసాద్, కళాశాల డైరెక్టర్ టి.విజయలక్ష్మి, ప్రిన్సిపాల్ ఎస్.కల్పన పాల్గొన్నారు.