లైంగిక దాడుల్లో మీడియా ప్రభావం

ABN , First Publish Date - 2022-12-10T01:11:12+05:30 IST

సమాజంలో మీడియాలో భాగంగా ఉన్న సీరియల్స్‌, సినిమాల్లో స్త్రీలను చూపిస్తున్న విధానం వల్ల ప్రభావితమవుతున్నవారు స్త్రీలు, మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు దిగడానికి కూడా ఒక కారణమవుతోందని రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, జర్నలిజం విభాగం, ఉస్మానియా వర్శిటీ పద్మజ షా అన్నారు.

లైంగిక దాడుల్లో మీడియా ప్రభావం

మొగల్రాజపురం, డిసెంబరు 9 : సమాజంలో మీడియాలో భాగంగా ఉన్న సీరియల్స్‌, సినిమాల్లో స్త్రీలను చూపిస్తున్న విధానం వల్ల ప్రభావితమవుతున్నవారు స్త్రీలు, మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు దిగడానికి కూడా ఒక కారణమవుతోందని రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, జర్నలిజం విభాగం, ఉస్మానియా వర్శిటీ పద్మజ షా అన్నారు. నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 10 వరకు యూనిసెఫ్‌ పిలుపు మేరకు కేవీఎ్‌సఆర్‌ సిద్ధార్థ ఫార్మశీ కళాశాలలో సెక్సువల్‌ హెరా్‌సమెంట్‌ మానిటరింగ్‌ కమిటీ కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ టి.సరళాదేవి ఆధ్వర్యంలో మహిళలపై హింస-మీడియా అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ సమాజంలో బాలబాలికలు ఒకరిపై ఒకరు గౌరవభావంతో మెలగాలన్నారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆచంట సునీత, స్టెప్‌ ఏ హెడ్‌ ఫర్‌ ఈక్వాలిటీ సంస్థ అధ్యక్షురాలు జోత్స్న మాట్లాడుతూ పిల్లలను ప్రతి తల్లిదండ్రీ గమనిస్తుండాలని సూచించారు. దీంతో వారు దారితప్పే అవకాశం ఉండదన్నారు. కేఎల్‌యూ విద్యార్థులు, ఫార్మశీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

సిద్ధార్థ మహిళా కళాశాలలో..

లబ్బీపేట : సమాజంలో ఎటువంటి అన్యాయం జరిగినా దానికి న్యాయం జ రగాలని కోరుకోవాలే గానీ హింసామార్గం తగదని ఉస్మానియా వర్శిటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జర్నలిజం రిటైర్డ్‌ ఫ్రొఫెసర్‌ పద్మజ షా అన్నారు. సిద్థార్ధ మహిళా క ళాశాలలో శుక్రవారం మహిళలపై హింస-మీడియా ప్రభావం అనే అంశంపై సె మినార్‌ జరిగింది. సందర్భంగా మాట్లాడుతూ సినిమాలు, టీవీల ప్రభావం పిల్లల పై ప్రభావం చూపుతోందని వాటి నుంచి దూరంగా ఉంచాలని సూచించారు. కళాశాల డైరెక్టర్‌ టి.విజయలక్ష్మి, ప్రిన్సిపాల్‌ ఎస్‌.కల్పన మాట్లాడుతూ మీడియా చూపించే ఏ అంశాన్నయినా పాజిటివ్‌ వే లోనే చూడాలన్నారు. సేఫ్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షురాలు జి.జ్యోత్స్న, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T01:11:13+05:30 IST