సచివాలయ ఉద్యోగులు పనితీరు మెరుగుపరుచుకోవాలి

ABN , First Publish Date - 2022-10-12T06:23:07+05:30 IST

సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించటంతోపాటు పని తీరును మెరుగుపరుచుకోవాలని జేసీ శ్రీవాస్‌ అజయ్‌ కుమార్‌ నుపూర్‌ అన్నారు.

సచివాలయ ఉద్యోగులు  పనితీరు మెరుగుపరుచుకోవాలి
వివరాలు అడిగి తెలుసుకుంటున్న జేసీ

కంచికచర్ల, పరిటాల సచివాలయాల్లో జేసీ తనిఖీలు

కంచికచర్ల రూరల్‌, అక్టోబరు 11: సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించటంతోపాటు పని తీరును మెరుగుపరుచుకోవాలని జేసీ శ్రీవాస్‌ అజయ్‌ కుమార్‌ నుపూర్‌ అన్నారు. కంచికచర్ల, పరిటాల సచివాలయాలను మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం మెరుగైన సేవలు అందిస్తుందన్నారు. ప్రభుత్వానికి అనుగుణంగా సచివాలయ ఉద్యోగులు పని చేయాలని తెలిపారు. అనంతరం సిబ్బంది పని తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం నోటీస్‌ బోర్డులో పెట్టిన సేవలు, బయోమెట్రిక్‌ రిజిస్టర్‌లను పరిశీలించారు.  కార్యక్రమంలో తహసీల్దార్‌ రాజకుమారి, అధికారులు పాల్గొన్నారు. 

Read more