గోదా దేవికి సారె సమర్పణ

ABN , First Publish Date - 2022-12-30T00:39:48+05:30 IST

దావాజీగూడెం సీతారామచంద్ర స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా గురువారం గోదాదేవికి సారె సమర్పణ వైభవంగా నిర్వహించారు.

గోదా దేవికి సారె సమర్పణ

గన్నవరం, డిసెంబరు 29: దావాజీగూడెం సీతారామచంద్ర స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా గురువారం గోదాదేవికి సారె సమర్పణ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి పసుపు కుంకుమ, సున్నిపిండి, పూలు, పండ్లు, గాజులు, చలిమిడి, నూతన వస్ర్తాలతో పాటు 27 రకాల స్వీట్లు, వివిధ రకాల పరిమళ ద్రవ్యాలు, అలం కార సామగ్రిని సమర్పించారు. ఆలయ అర్చకుడు రామాచార్యులు విశేష పూజలు చేశారు. ధనుర్మాస గోష్టి సభ్యులు, భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Updated Date - 2022-12-30T00:39:49+05:30 IST