పాలకులున్నా.. అభివృద్ధి సున్నా..!

ABN , First Publish Date - 2022-09-10T06:38:27+05:30 IST

57వ డివిజన్‌లోని న్యూ రాజరాజేశ్వరిపేటలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నా యి.

పాలకులున్నా.. అభివృద్ధి సున్నా..!

పారిశుధ్య లోపంతో వేధిస్తున్న సమస్యలు

ముక్కుపుటాలు అదిరే దుర్గంధం

న్యూ రాజరాజేశ్వరిపేట వాసులకు నరకం 

అజిత్‌సింగ్‌నగర్‌, సెప్టెంబరు 9 : 57వ డివిజన్‌లోని న్యూ రాజరాజేశ్వరిపేటలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నా యి. కాలువల్లో మురుగు నీరు కదలక రోజు ల తరబడి నిల్వ ఉండటంతో ఆ ప్రాంతమం తా తీవ్ర దుర్గందం వెదజల్లుతోంది. వారం రోజులకు ఒకసారైన చెత్త ఎత్తకపోవడంతో అక్కడ పందులు, కుక్కలు సంచరిస్తున్నాయి. మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో తీవ్రమైన కంపు కొడుతోందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిర్లక్ష్య వైఖరితో పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త పన్ను వసూలు చేస్తున్నా పారిశుధ్యంలో చిత్తశుద్ధి లేదని విమర్శిస్తున్నారు. పైగా సిబ్బంది కొరత వల్లే ఇబ్బంది అని అధికారులు చెబుతున్నార్నఆ్నరు. దీంతో పాలకులున్నా అభివృద్ధి సున్నాగా ఉందని ఆరోపిస్తున్నారు. 

Read more