రైతులను నమ్మించి ముంచిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-12-12T00:55:16+05:30 IST

రైతు ప్రభుత్వం అని చెప్పుకునే జగన్‌ ప్రభుత్వం పంట మొత్తం తామే కొంటామని చెప్పి, తీరా కొనే సమయంలో ఆంక్షలు విధిస్తోందని, ప్రభుత్వ ఆంక్షల వల్ల నేడు వరి రైతు నిండా మునిగాడని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 రైతులను నమ్మించి ముంచిన ప్రభుత్వం

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, డిసెం బరు 11 : రైతు ప్రభుత్వం అని చెప్పుకునే జగన్‌ ప్రభుత్వం పంట మొత్తం తామే కొంటామని చెప్పి, తీరా కొనే సమయంలో ఆంక్షలు విధిస్తోందని, ప్రభుత్వ ఆంక్షల వల్ల నేడు వరి రైతు నిండా మునిగాడని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరవల్లి గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ గ్రామ చైతన్య కార్యక్ర మానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ, రైతు పండించిన పంట ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తున్నామని మభ్య పెడుతూ సంచులు అందించలేక పోగా తేమ శాతం ఎక్కువగా ఉందంటూ మద్దతు ధరలో కూడా కోసి ఇవ్వడమేనా రైతాంగానికి చేకూర్చే లబ్ధి అని ప్రశ్నిం చారు. రైతుల మనోవేదనకు కారణమైన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే రైతు లకు మంచి రోజులొస్తాయన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులతో పాటు మధ్యతరగతి, పేద కుటుంబాల జీవితాలు దర్భర పరిస్థితిలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో బీసీల ఉన్నతికి ఏర్పాటు చేసిన పథకాలన్నీ ఆపేశారంటూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల అభివృద్ధికి చేసిందోంటో వివరించాలని సవాల్‌ చేశారు. గన్నవరం లో మైనింగ్‌ మాఫియా ఎమ్మెల్యే అండ దండలతో నడుస్తోందన్నారు. దోచుకున్న సొమ్ములో కొంత ప్రజలకు పంచి పెడుతూ ఆర్థిక సాయం అందించినట్లు చెప్పుకుంటు న్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో లంక సురేంద్ర మోహన బెనర్జీ, తొమ్మం డ్రు జోజి ప్రతాప్‌, గుండపనేని ఉమా వరప్రసాద్‌, పిల్లా రామారావు, మండాది రవీంద్ర, లంక అజయ్‌, షేక్‌ సుభాని, గం గాధరరావు, కానూరి శ్రీను, కానోళ్ల వెంక టేశ్వరరావు, వంశీ, సందీప్‌ నానిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T00:55:16+05:30 IST

Read more