కొత్త రైలు మార్గంతో నష్టపోతాం : కలెక్టర్‌కు రైతుల వినతి

ABN , First Publish Date - 2022-09-13T07:15:20+05:30 IST

తమ పొంట పొలాల్లో నుంచి కొత్త రైల్వే మార్గం వేయడం వల్ల నష్టపోతామని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావును రైతులు స్పందనలో కలిసి వినతిపత్రం అందించారు.

కొత్త రైలు మార్గంతో నష్టపోతాం : కలెక్టర్‌కు రైతుల వినతి

మైలవరం రూరల్‌ : తమ పొంట పొలాల్లో నుంచి కొత్త రైల్వే మార్గం వేయడం వల్ల నష్టపోతామని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావును  రైతులు స్పందనలో కలిసి వినతిపత్రం అందించారు. కొత్త రైల్వే మార్గం వేస్తే తాము  పంట భూములు కోల్పోతామని, పశువులకు మేత లేకుండా పోతుందని,  ప్రత్యామ్నాయ మార్గంలో పాత లైన్‌ ఉన్న కొండపల్లి, ఎర్రుపాలెం మీదుగా ఖమ్మం జిల్లాకు రైల్వే మార్గం చేసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.  రైతులు ఒరుగు సాంబశివరావు, అలవాల రామకృష్ణా రెడ్డి, బొమ్ము రెడ్డి శ్రీనివాస రెడ్డి, జోనబోయిన జమలయ్య, కోట వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more