ఆర్టీసీలో నగదు రహిత లావాదేవీలు

ABN , First Publish Date - 2022-08-31T06:59:52+05:30 IST

ప్రజారవాణా సంస్థ (ఆర్టీసీ)లో ఇకపై అత్యాధునిక సాంకేతికతతో ముడిపడిన యూనిఫైడ్‌ టిక్కెటింగ్‌ సొల్యూషన్‌ (యూటీఎస్‌) ద్వారా నగదు రహిత లావాదేవీలను నిర్వహించనున్నారు.

ఆర్టీసీలో నగదు రహిత లావాదేవీలు

- ఎండీ ద్వారకా తిరుమలరావు

వన్‌టౌన్‌, ఆగస్టు 30 : ప్రజారవాణా సంస్థ (ఆర్టీసీ)లో ఇకపై అత్యాధునిక సాంకేతికతతో ముడిపడిన యూనిఫైడ్‌ టిక్కెటింగ్‌ సొల్యూషన్‌ (యూటీఎస్‌) ద్వారా నగదు రహిత లావాదేవీలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ నియమావళిని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు మంగళవారం ఆవిష్కరించారు. డిపో స్థాయిలో కండక్టర్‌, డ్రైవర్‌ల నుంచి పై స్థాయి అధికారి వరకు దీనిని అమలు చేయాలని, ఆర్టీసీ అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా ఎండీ కోరారు. ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు కల్పించడంలో అధికారులు, సిబ్బంది సహకరించాలని సూచించారు. యూటీఎస్‌ ద్వారా ప్రయాణికులు ఎక్కే స్టేజీకి ముందుగా రిజర్వు చేసుకునే సౌకర్యం ఉంది. దీని ద్వారా కాగిత రహిత బస్సుపా్‌సను అందించనున్నారు. ఒకే యాప్‌ ద్వారా ముందస్తుగా టికెట్‌ బుక్‌ చేసుకోవడం, బస్సుల రాకపోకలు, సరుకు రవాణా వివరాలు తెలుసుకోవడం, గ్రామీణ ప్రాంత బస్సుల టికెట్లు కొనుగోలు చేయడం, యూపీఐ, డెబీట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు, వాలెట్‌ ఇతర కార్డుల ద్వారా, క్యూ ఆర్‌ కోడ్‌ స్కానింగ్‌తో కూడా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. 

Read more