ఎన్టీఆర్‌ పేరు తొలగించడం దుర్మార్గం

ABN , First Publish Date - 2022-09-27T06:05:52+05:30 IST

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును తొలగించడం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు అన్నారు

ఎన్టీఆర్‌ పేరు తొలగించడం దుర్మార్గం
ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న టీడీపీ నేతలు

ఎన్టీఆర్‌ పేరు తొలగించడం దుర్మార్గం

పాయకాపురం, సెప్టెంబరు 26 : ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును తొలగించడం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు అన్నారు. 63వ డివిజన్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి సోమవారం పాలాభిషేకం చేసి అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విజయవాడకు ఎన్టీఆర్‌ జిల్లాగా పేరు పెట్టి ఎన్టీఆర్‌పై గౌరవం ఉన్నట్లు నటించిన జగన్‌ రెడ్డి యూనివర్సిటీకి ఆయన పేరును తొలగించి కపటబుద్ధిని బయటపెటుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీచ రాజకీయాలు చేస్తున్న వైసీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెప్తారని పేర్కోన్నారు. డివిజన్‌ టీడీపీ నేతలు లబ్బా వైకుంఠం, బత్తుల కొండ, కోలా శ్రీను, లబ్బా దుర్గ, బెజ్జం జైపాల్‌, ఎస్‌కె. బచ్చా, పాల్గొన్నారు. 

Read more