శ్మశానానికి స్థలం కేటాయించలేని దద్దమ్మ

ABN , First Publish Date - 2022-12-13T01:06:04+05:30 IST

క్రైస్తవ శ్మశానవాటికకు సెంటు స్ధలం కేటాయించలేని వ్యక్తి ఎమ్మెల్యే నాని అని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు విమర్శించారు.

శ్మశానానికి స్థలం కేటాయించలేని దద్దమ్మ

గుడివాడ : క్రైస్తవ శ్మశానవాటికకు సెంటు స్ధలం కేటాయించలేని వ్యక్తి ఎమ్మెల్యే నాని అని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు విమర్శించారు. సోమవారం స్ధానిక 21వ వార్డు రైలుపేటలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పా ల్గొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. రావి మా ట్లాడుతూ దళితుల శ్మశానవాటికకు కనీసం సెంటు స్థలం కేటాయించలేని దద్దమ్మ 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉండటం నియోజకవర్గం చేసుకున్న దురదృష్టమన్నారు. మంత్రి అయితే రూ.100 కోట్లతో నియోజకవర్గాన్ని ఎన్నడూ చూడని విధంగా అభివృద్ధి చేస్తానని ప్రగల్భాలు పలికిన నాని, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని అభివృద్ధి పను లు చేపట్టాడో చెప్పాలన్నారు. అనేక సార్లు దళిత సంఘాలు శ్మశాన వాటిక సమస్యను నాని దృష్టికి తీసుకువెళ్లినా సమ స్య పరిష్కారం కాలేదన్నారు. టిడ్కో గృహాలు ఉచితంగా ఇస్తానన్న జగన్మోహన్‌రెడ్డి మాటలు ఏమయ్యాయన్నారు. లక్షలాది రూపాయలు కట్టిస్తూ పేద ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కంచర్ల సుధాకర్‌, సయ్యద్‌ జబీన్‌, కాశీ, దేవరపల్లి కోటి, ముళ్ళపూడి రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T01:06:04+05:30 IST

Read more