రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఏదీ?

ABN , First Publish Date - 2022-04-24T05:57:29+05:30 IST

రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఏదీ?

రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఏదీ?

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, ఏప్రిల్‌ 23 : అవగాహన లేని మహిళా హోం మంత్రి, సమాచారం తెలియని ముఖ్యమంత్రి పాలనలో రాష్ట్రంలోని మహిళ రక్షణ కరువయిందని టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నగరం నడిబొడ్డున మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం సిగ్గుచేటన్నారు. రాజ్యాగ బద్ధమైన పదవిలో ఉన్న మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, పోలీసులు కూడా వైసీపీ భజన బ్యాచ్‌ లానే తయారయ్యారని విమర్శించారు.

గన్నవరం : జగన్మోహనరెడ్డి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మల్లంపల్లి జయమ్మ ఆరోపిం చారు. స్థానిక సంఘ కార్యాలయంలో  శనివారం విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళ లపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు చూ స్తుంటే మహిళలకు రక్షణ లేదని స్పష్టంగా అర్ధ మవుతుందన్నారు. ఐద్వా నాయకురాలు కె. సర స్వతి, మల్లంపల్లి ఆంజనేయులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-24T05:57:29+05:30 IST