-
-
Home » Andhra Pradesh » Krishna » Ramakrishna comments anr-MRGS-AndhraPradesh
-
Ramakrishna: ములాయం మరణం బాధాకరం..
ABN , First Publish Date - 2022-10-11T13:55:53+05:30 IST
ములాయం సింగ్ యాదవ్ మృతిపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంతాపం తెలిపారు.

విజయవాడ (Vijayawada): ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) మృతిపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ములాయం 10 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు ఎంపీగా గెలుపొంది ప్రజల మన్ననలు పొందారన్నారు. అట్టడుగు వర్గాల నాయకుడిగా పేరుగాంచి, బీసీల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. చివరి వరకు లౌకికవాదానికి ములాయం సింగ్ కట్టుబడి ఉన్నారని, సంకీర్ణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. దేశ రాజకీయ పరిణామాలు మారుతున్న కీలక దశలో ములాయం మరణం బాధాకరమని రామకృష్ణ పేర్కొన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రి, అభిమానుల, పార్టీ శ్రేణుల ‘నేతాజీ’.. ములాయం సింగ్ యాదవ్ ఇకలేరు. ఎన్నికల బరిలో తిరుగులేని మల్ల యోధుడు, సంకీర్ణ రాజకీయాలను మలుపుతిప్పిన ‘కింగ్ మేకర్’... తన సుదీర్ఘ ప్రస్థానం ముగించారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో కొంత కాలంగా బాధపడుతున్న ఆయనను ఈ నెల రెండో తేదీన గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే సోమవారం శాశ్వతంగా కన్నుమూసినట్టు ములాయం కుమారుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. విలీనాలు, విచ్ఛిన్నాలతో నిండిన ఒకప్పటి సంకీర్ణ అధికార రాజకీయాల్లో నెగ్గుకురావడమే కష్టం. అలాంటిది పదిసార్లు ఎమ్మెల్యే.. ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ములాయం అప్రతిహతంగా తన ప్రస్థానం కొనసాగించారు.