-
-
Home » Andhra Pradesh » Krishna » Rajiv Gandhi Park-NGTS-AndhraPradesh
-
రాజీవ్ గాంధీ పార్కు రెడీ
ABN , First Publish Date - 2022-09-30T06:35:20+05:30 IST
రాజీవ్‌గాంధీ పార్కును ఆధునీకరించి నగర ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, కమిషనర్ స్వప్నిల్ అన్నారు.

రూ.2.50కోట్లతో ముస్తాబు
ప్రారంభించిన మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే శ్రీనివాసరావు, వీఎంసీ కమిషనర్ స్వప్నిల్
చిట్టినగర్, సెప్టెంబరు 29 : రాజీవ్‌గాంధీ పార్కును ఆధునీకరించి నగర ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, కమిషనర్ స్వప్నిల్ అన్నారు. రూ.2.56కోట్లతో అభివృద్ధి చేసిన రాజీవ్‌గాంధీ పార్కును గురువారం సాయంత్రం మేయర్, ఎమ్మెల్యే, వీఎంసీ కమిషనర్ పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మా ట్లాడుతూ 8.68 ఎకరాల్లో ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ పార్కు ను 14వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి చేశామన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) పద్ధతిలో రూ.4కోట్లతో అభివృద్ధి చేసిన స్కేటింగ్ రింగ్, రోజ్ గార్డెన్, బోన్సాయ్ గార్డెన్, కెఫెటేరి యా, ఫౌంటైన్స్, వింటేజ్ ట్రైన్ స్టేషన్, బయోడైవర్సిటీ మ్యూజి యం, చిల్డ్రన్స్ ప్లే జోన్, పార్టీ ఏరియా, టాయిలెట్స్, క్లిఫ్ వాక్ వంటిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పీపీపీ పద్ధతిలో ప్లే జోన్ ఏర్పాటు చేసి ఆట పరికరాల ఏర్పాటుతోపాటు ఆవరణలో చిన్న చిన్న కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకున్నామన్నారు. పాత్వే, వాకింగ్ ట్రాక్ సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎండి.రుహుల్లా, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవు తు శైలజారెడ్డి, కార్పొరేటర్లు, వీఎంసీ అధికారులు పాల్గొన్నారు.