తొక్కిసలాటలో మృతిచెందిన రాజేశ్వరికి నివాళి

ABN , First Publish Date - 2022-12-30T01:06:18+05:30 IST

నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబా బు నిర్వహించిన రోడ్‌షోలో బుధవారం రాత్రి జరిగిన తొ క్కిసలాటలో మృతి చెందిన ఈదుమూడి రాజేశ్వరికి నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో నేతలు నివాళులు సమర్పించారు.

తొక్కిసలాటలో మృతిచెందిన రాజేశ్వరికి నివాళి

విద్యాధరపురం : నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబా బు నిర్వహించిన రోడ్‌షోలో బుధవారం రాత్రి జరిగిన తొ క్కిసలాటలో మృతి చెందిన ఈదుమూడి రాజేశ్వరికి నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో నేతలు నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ సింహాద్రి కనకాచారి మాట్లాడు తూ టీడీపీ రాష్ట్ర బీసీసెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి చిలకపాటి మధు చెల్లెలు రాజేశ్వరి మృతి బాధాకరమన్నారు. ఆమె కుటుంబానికి చంద్రబాబు రూ.15లక్షల పరిహారంతో పాటు వారి కుటుంబానికి అండగా ఉంటానని, చదువుకునే పిల్లలను ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ తరఫున చదివిస్తామని హామీ ఇచ్చి ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పించారన్నారు. ఆ కుటుంబానికి విశ్వబ్రాహ్మణ సంఘీయులు సానుభూతి తెలిపారు. నే తలు గట్టి శ్రీనివాసరావు, మేడూరి శివ రాంబ్రహ్మం, వీఎస్‌ బాబూరావు నివాళులర్పించిచారు.

ఎంపీ కేశినేని నాని నివాళి

కందుకూరు ఘటనలో మృతి చెందినవారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) తెలిపారు. ఈ మేరకు కేశినేని భవ న్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా వెలుగుతున్న దీపం ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Updated Date - 2022-12-30T01:06:18+05:30 IST

Read more