-
-
Home » Andhra Pradesh » Krishna » Rainwater in classrooms-NGTS-AndhraPradesh
-
తరగతి గదుల్లో వర్షపు నీరు
ABN , First Publish Date - 2022-09-10T06:03:56+05:30 IST
తరగతి గదుల్లో వర్షపు నీరు

మోపిదేవి: పెదకళ్లేపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పైకప్పు సరిగా లేకపోవటంతో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు వర్షపు నీరు చేరింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నాడు - నేడు పనుల్లో భాగంగా పాఠశాలలో రూ.37 లక్షలతో మరమ్మతులు చేసింది. తరగతి గదుల్లోని పైకప్పునకు మరమ్మతులు చేసినా కురిసిన వర్షాలకు పైకప్పు రంధ్రాలు పడి ధారగా వర్షపు నీరు గదుల్లో చేరింది. విద్యార్థులు, ఉపా ధ్యాయులు ఇబ్బంది పడ్డారు. జనసేన పార్టీ కార్యకర్తలు పాఠశాల వద్దకు వెళ్లి తరగతి గదులను పరిశీలించారు. రూ.37 లక్షలతో పాఠశాలలో అభివృద్ధి పనులు చేశామని చెబుతున్నా.. మరమ్మతులు చేయటంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు.