విద్యార్థినులకు నాణ్యమైన భోజనం పెట్టాలి: దిల్లీరావు

ABN , First Publish Date - 2022-12-13T01:41:04+05:30 IST

విద్యార్థినులకు నాణ్యమైన భోజనం పెట్టడంతో పాటు గుణాత్మక విద్యను అందించాలని కొండపల్లి గిరిజన గురుకుల పాఠశాల సిబ్బందికి ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు ఆదేశించారు.

విద్యార్థినులకు నాణ్యమైన భోజనం పెట్టాలి: దిల్లీరావు

కొండపల్లి గిరిజన గురుకుల పాఠశాలలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

ఇబ్రహీంపట్నం, డిసెంబరు 12: విద్యార్థినులకు నాణ్యమైన భోజనం పెట్టడంతో పాటు గుణాత్మక విద్యను అందించాలని కొండపల్లి గిరిజన గురుకుల పాఠశాల సిబ్బందికి ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు ఆదేశించారు. కొండ పల్లి మున్సిపాలిటీలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన సోమ వారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థినులతో ముచ్చటించారు. వసతిగృహంలో వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ సూర్యారావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T01:41:04+05:30 IST

Read more