-
-
Home » Andhra Pradesh » Krishna » PV Sindhu visiting Ganesha-NGTS-AndhraPradesh
-
వినాయకుడిని దర్శించుకున్న పీవీ సింధు
ABN , First Publish Date - 2022-09-08T06:36:35+05:30 IST
వినాయకుడిని దర్శించుకున్న పీవీ సింధు

వన్‌టౌన్, సెప్టెంబరు 7: పూజారివారివీధిలోని బాలగణపతి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాల్లో స్వామి బుధవారం సిద్ధి, బుద్ధి సమేత గణపతిగా దర్శనమిచ్చారు. స్వామిని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడా కారిణి పీవీ సింధు దర్శించుకున్నారు. ప్రత్యేక అర్చనల అనంతరం నిర్వాహకులు ఆమెను సత్కరించారు. స్వామివారి ప్రసాదం, శేషవస్త్రం అందించారు. నిర్వాహకులు గ్రంథి శ్రీనివాసరావు, ఆత్కూరి రాంబాబు, మామిడి లక్ష్మీ వెంకటకృష్ణారావు తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.