ప్రజాసేవకుడు గద్దె

ABN , First Publish Date - 2022-09-29T06:37:29+05:30 IST

ఎన్నికలతో సంబంఽ దం లేకుండా ప్రజలకు అందు బాటులో ఉంటూ వారికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తూ అంకిత భావంతో ప్రజాసేవ చేస్తున్న నాయకుడు గద్దె రామ్మోహన్‌ అని శాసనమండలి మాజీ చైర్మన్‌ ఎం.ఎ షరీఫ్‌ అన్నారు.

ప్రజాసేవకుడు గద్దె
కంటి పరీక్ష చేయించుకుంటున్న షరీఫ్‌

ప్రజాసేవకుడు గద్దె

శాసనమండలి మాజీ చైర్మన్‌ షరీఫ్‌

 లబ్బీపేట, సెప్టెంబరు 28 : ఎన్నికలతో సంబంఽ దం లేకుండా ప్రజలకు అందు బాటులో ఉంటూ వారికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తూ అంకిత భావంతో ప్రజాసేవ చేస్తున్న నాయకుడు గద్దె రామ్మోహన్‌ అని శాసనమండలి మాజీ చైర్మన్‌ ఎం.ఎ షరీఫ్‌ అన్నారు. 19వ డివిజన్‌ గ్రీన్‌ల్యాండ్స్‌ మండపంలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా బుధవారం ఉయ్యూరు రోటరీ క్లబ్‌ సహకారంతో గద్దె రామ్మోహన్‌ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గద్దెతో కలిసి షరీఫ్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. అనంతరం ఆయన కంటిపరీక్షలను చేయించుకున్నారు. 400మందికి పరీక్షలు నిర్వహించగా 30మందికి కంటి ఆపరేషన్లు, 320మందిక కళ్లజోళ్లను వైద్యులు సూచించారు. టీడీపీ నాయకులు ఎస్‌. ఫిరోజ్‌, జాస్తి సాంబశివరావు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Read more